
విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని మాత్రమే పేర్కొందని, తాము పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే జోన్ తో సంబంధం లేకుండా ఏపీ రైల్వేలలో సంస్కరణలు మొదలుపెట్టామని, వెయ్యి కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని 20 రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల స్ధాయిలో సరికొత్తగా ఆధునికీకరిస్తామని రైల్వేమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో పలు ప్రాంతాలతో కనెక్టివిటీ కావాలంటే విజయవాడ చాలా ఇంపార్టెంట్ అని, అందుకే ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 22 వేల కోట్ల రూపాయల పనులు చేపట్టినట్టు, కేంద్ర మంత్రి తెలిపినట్లుగా సీఎం చెప్పారు. అలాగే పుష్కరాలకు అవసరమైన రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఏపీ రవాణా హబ్ గా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు.
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…
The IT and software sector has been one of the biggest contributors to revenue generation…