
చాలా సర్వే సంస్థలు ఏకంగా 2014 కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు బీజేపీకి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం మోడీ వేవ్ ని సర్వేలు ఓవర్ ఎస్టిమేట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. “బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సొంతంగా రాకపోయినా మిత్రుల సాయంతో వచ్చే అవకాశం ఉంది. ఆ అవసరం ఎంత వరకూ ఉంటుంది అనేది చూడాలి. అయితే 2014 కంటే మెరుగైన ఫలితాలు రాబట్టడం అంత తేలిక కాదు,” అని వారు విశ్లేషించారు.
“మోడీ రావడం ఖాయమని తేలినప్పుడు ఈ టీవీ ఛానల్స్ అటుఇటుగా సర్వేలు ఇచ్చి మోడీ అమిత్ షాల కోపానికి గురికావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత ఎక్కువగా ఇస్తే అంతగా మోడీ దృష్టిలో పడొచ్చు. గతంలో 2014 సందర్భంగా బీజేపీని సర్వేలు తక్కువ అంచనా వేసాయి. అది దృష్టిలో పెట్టుకుని కూడా ఎక్కువగా ఇచ్చి ఉండొచ్చు,” అని వారు అంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది తేలాలంటే 23వ తారీఖు వరకు ఆగాల్సిందే.
Bigg Boss Telugu Season 10 continues to keep viewers hooked with high drama. As the…
ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…