సూర్య “24” సినిమాకున్న క్రేజ్ కు నిదర్శనం!

‘మనం’ సినిమా దర్శకుడు విక్రం కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా “24.” ఈ సినిమా తొలి టీజర్ ను 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల కానున్న విషయం నెటిజన్లకు తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్ లో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT

సూర్య నటించిన ‘సెవెంత్ సెన్స్’ సినిమాలోని కొన్ని సీన్లకు, మరికొన్ని హాలీవుడ్ సినిమాల దృశ్యాలను కలిపి ఒక టీజర్ ను రూపొందించి యూ ట్యూబ్ లో విడుదల చేయగా, అదే ‘24’ సినిమా టీజర్ గా ప్రచారమవుతోంది. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రన్ అయ్యే ఈ టీజర్ కు బాగానే కట్ చేసారు.

సాధారణంగా ఒక రేంజ్ సినిమాలకు మాత్రమే అభిమానులు రూపొందించే ముందస్తు టీజర్లు సందడి చేస్తుంటాయి. రజనీకాంత్, పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఇలాంటి ఫేక్ టీజర్లతో యూ ట్యూబ్ లో తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా ఆ జాబితాలో సూర్య కూడా చేరడం విశేషం. అంటే సూర్య క్రేజ్ విపరీతంగా పెరిగిందో లేక ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయో గానీ విడుదలైన తర్వాత “24” టీజర్ ఒక సెన్సేషన్ సృష్టించేలా కనపడుతోంది.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

3 hours ago

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

4 hours ago