
జీ నెట్వర్క్ సినిమాకు సంబంధించిన నాలుగు భాషల హక్కులను 125 కోట్లకు దక్కించుకుందట. తాజాగా అదంతా అబద్దం అని తేలింది. ఈ సినిమా టీవీ హక్కులు సన్ నెట్వర్క్ దక్కించుకుందట. అది కూడా తెలుగు, తమిళ, మలయాళం వెర్షన్లు కేవలం 25 కోట్లు చెల్లించిందట. హిందీ టీవీ హక్కులు ఇంకా అమ్మాల్సి ఉంది.
అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే అన్ని భాషల డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. 125 కోట్ల వార్తను హైప్ కోసం నిర్మాతలే లీక్ చేశారా మీడియాకు అనే అనుమానాలు ఉన్నాయి. సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లో ఘనంగా జరగబోతుంది. చిత్రం లోని పాటలు కూడా అదే వేదిక మీద నుండి విడుదల అయ్యే అవకాశం ఉందట.
దేశంకోసం పోరాడిన ఒక వీరుడి గాధను దేశవ్యాప్తంగా పరిచయం చెయ్యాలని చిరంజీవి ఆశపడుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. హిందీ లో కూడా సినిమాకు డీసెంట్ బజ్ ఉందని నిర్మాతల అభిప్రాయం. చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చెయ్యడం తమకు కలిసి వస్తుందని చిత్రబృందం ఆశిస్తుంది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుండటం మరో కొత్త పరిణామం. ముస్లింలకు ప్రతినిధిగా చెప్పుకునే…
T Gopichand is preparing for SINGA, an action entertainer that marks the directorial debut of…