Telugu

ఏపీలో తలసాని మరో ప్రెస్ మీట్… బీసీలను చైతన్య పర్చడానికట

కేసీఆర్ ను ఇంప్రెస్స్ చెయ్యడానికో, లేక చంద్రబాబు మీద ఉన్న పాత పగ తీర్చుకోవడానికో తెలియదు గానీ తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పదే పదే విజయవాడ వచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. తాజాగా మరో సారి విజయవాడ వచ్చి మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇండియాలో ఎవరు ఎక్కడైనా పర్యటించుకోవచ్చని, తాము ఎపిలో పర్యటించి బలహీనవర్గాలను చైతన్యపరుస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలన చూస్తుంటే… మనం భారతదేశంలో ఉన్నామా?, వేరే దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని, ప్రభుత్వ పాలన ఆశాజనకంగా లేదని, ప్రచార ఆర్భాటమే తప్ప మరొకటి లేదన్నారు. మాట్లాడితే ముఖ్యమంత్రి రెవెన్యూ లోటు ఉందంటూ పదే పదే చెబుతూ మరోవైపు వేలకోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు సందర్భంగా ఏపీ సర్కార్‌ ఎన్నికల తాయిలాలు విపరీతంగా ప్రకటిస్తున్నారని, అయితే ఏం చేసినా ఈ సారి ఓటమిని తప్పించుకోలేరని చెప్పారు.మ్మ్

ADVERTISEMENT

గతంలో తాను ఏపీకి వచ్చి వెళ్లాక మావాళ్లను వేధించారని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు కూడా చాలమంది మంత్రులు వస్తారని, వారిని పోలీసులు ఎందుకు వచ్చారని అడగరని అన్నారు. హాయ్‌ ల్యాండ్ లో బస చేస్తున్నానని హాయ్‌ ల్యాండ్ యాజమాన్యంను కూడా పోలీసులు బెదిరించారన్నారు. తాను ప్రెస్‌మీట్‌ పెట్టిన హోటల్ యాజమాన్యంపై కూడా ఒత్తిడి చేశారని, ఏపీలో ప్రభుత్వ పాలన దారుణంగా ఉందని అన్నారు. తలసాని వ్యాఖ్యల పై తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. అయితే ఎన్నికల వేళ బీసీని కాబట్టి ఏమీ చెయ్యలేరని తలసాని ధీమా.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Vaazha 2 Review: Packed with Youth Connect

BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…

1 hour ago

CSK vs MI: Kerala Star Leaves Hardik’s MI Helpless

Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…

4 hours ago