Telugu

మన హీరోలు నామోషీగా ఫీల్ అయ్యారట

ఇటీవలే తన ఓటీటీ అరంగేట్రం చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఆమె టెలివిజన్ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉంది. ఈ నటి తెలుగులో జెమినీ టీవీలో ప్రసారం కాబోయే ప్రముఖ వంటల షో మాస్టర్ చెఫ్ కు హోస్ట్ గా మారబోతుంది. ఫ్రాంక్ రోడామ్ చేత సృష్టించబడిన ఈ షో తరువాత అనేక దేశాలలో స్వీకరించబడింది.

సన్ నెట్వర్క్ ఈ షో కన్నడ వెర్షన్ కోసం సుదీప్ ని తీసుకోగా విజయ్ సేతుపతి తమిళ వెర్షన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సన్ నెట్‌వర్క్ తెలుగు వెర్షన్ కోసం ఎవరైనా ఒక పెద్ద హీరో హోస్ట్ గా ఉండాలని కోరుకుంది కాని ఎవరినీ ఒప్పించలేకపోయింది. వంటల కార్యక్రమం చెయ్యడం తమకు నామోషీ అని వాళ్ళు ఫీల్ అయ్యారట.

ADVERTISEMENT

ఆ విధంగా తమన్నాకు ఈ ఆఫర్ వచ్చింది. ఆమె ఇంకో ఆలోచన లేకుండా దానిని దక్కించుకుంది. ఇక పోతే… ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో సీటీమార్, ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం, మరియు మాస్ట్రోలో చిత్రాలలో నటిస్తుంది. సీటీమార్ విడుదలకు సిద్ధంగా ఉంది మరియు ఇతర చిత్రాలు వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి.

థియేటర్లు తెరిచిన తర్వాత సీతిమార్ విడుదల తేదీని ప్రకటించవచ్చు. మరోవైపు మేస్ట్రో చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఆన్ లైన్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమా విడుదల అయ్యేదీ ఇంకా తెలియరాలేదు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Chay’s Vrushakarma Dussehra Poster Shows Spiritual Side

Naga Chaitanya’s Vrushakarma is gearing up for a theatrical release on December 4. Extending Dussehra…

34 minutes ago

Harsh Truth for Sooryavanshi: Is GG Behind His Snub?

Vaibhav Sooryavanshi has shown his talent at a young age, but finding a regular place…

54 minutes ago