Telugu

మరో ‘నందమూరి’ హీరో కారుపై పోలీసులు ఫైన్!

హైదరబాద్ లోని సారధి స్టూడియో పరిసర ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించనందుకు గానూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 700 రూపాయలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. నిబంధనలకు సెలబ్రిటీలు, అధికారులు అతీతులు కారని చాటి చెప్తున్న హైదరాబాద్ పోలీసులు తాజాగా మరో నందమూరి హీరో కారుకు ఫైన్ విధించారు.

హైదరాబాద్ లోని జుబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ప్రయాణిస్తున్న నందమూరి తారకరత్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడం చూసిన పోలీసులు కారును ఆపి, 700 రూపాయలు జరిమానా విధించారు. అలాగే కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ స్టిక్కర్ ను కూడా తొలగించారు. ‘సౌండ్’ పార్టీలకు నిలయంగా ఉండే జుబ్లీహిల్స్ ప్రాంతంలో కార్లకు బ్లాక్ ఫిల్మ్ స్టిక్కరింగ్ తీయలేదన్న సమాచారంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులకు సామాన్య జనాలతో పాటు నందమూరి తారకరత్న కూడా చిక్కారు. మొత్తమ్మీద రూల్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు పాటిస్తున్న విధానాలకు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, శరణ్య… బాధితులు ఎవరు?

ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…

18 minutes ago

175/175 ఓ భ్రమ… ఈసారి మనమే మరో భ్రమ?

కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…

26 minutes ago