
రాష్ట్రంలో ఎవరితో పొత్తు పెట్టుకోబోమని ఇటీవలే నియమించబడ్డ ఎపి వ్యవహారాల ఇన్ చార్జీ ఊమెన్ చాంది చెప్పారు. తాము ఏ పార్టీతో అవగాహనకు రావడం లేదని, ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని ఆయన అన్నారు. ఎపిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది కష్టసాద్యమైనదని తెలుసునని, అయినా ప్రజల వద్దకు వెళతామని, వారితోనే ఉంటామని ఆయన అన్నారు.
ఇంటింటికి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి వాస్తవ పరిస్తితి వివరించే యత్నం చేస్తారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా తదితర అంశాలను బిజెపి విస్మరించిందని ఆయన అన్నారు. అదే సమయంలో టిడిపి నాలుగేళ్లు బిజెపితో కలిసి ఉండి,ఇప్పుడు ప్రజలను తప్పు దారి పట్టించే యత్నం చేస్తోందని చాందీ అన్నారు. దీనితో ఈ ఊహాగానాలకు తెరపడినట్టే అనుకోవచ్చు.
పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ముఖ్యమంత్రులలో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రులు కూడా వేరేగా ఉంటారు. ఆ కోవకు చెందినవారే…
YS Jagan and KTR publicly refer to each other as brothers, and the two of…