
ఈరోజు తేజస్వి మదివాడ బర్త్ డే సందర్భంగా కమిట్మెంట్’లో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో బికినీ ధరించి బోల్డ్ అవతార్‌లో తేజస్వి దర్శనమిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన తేజస్వికి సరైన బ్రేక్ రాక ఇబ్బంది పడుతుంది.
బిగ్ బాస్ కారణంగా ఆడియన్స్ దృష్టిలో పడినా పెద్దగా అవకాశాలు రాలేదు. దీనితో ఈ అమ్మడు అందాల ఆరబోత డోసు పెంచింది. ఆ ప్రకారం వస్తున్న ఈ కమిట్మెంట్ ఏ విధంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి. బికినీలో ఆమె చాలా గ్లామరస్ గా కనిపించింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా రచన, దర్శకత్వం అందిస్తోన్న ఈ చిత్రానికి నరేష్ కుమరన్ సంగీతం సమకూరుస్తున్నారు. లక్ష్మీకాంత్ ఇటీవలే ఆహా కు ఎక్సక్లూసివ్ గా నవదీప్ హీరోగా రన్ అనే సినిమా తీశారు. అది కూడా ప్లాప్ గా మారింది. దీనితో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…