
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ కోసం జీవో నెం 123ను ప్రయోగించడం కుదరదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతేకాకుండా మెజారిటీ రైతులు డిమాండ్ చేసే ధరలనే పరిహారంగా చెల్లించి భూములను సేకరించాలని కూడా పకడ్బందీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో షాక్ తిన్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విధానపరమైన నిర్ణయాల్లో కేసీఆర్ సర్కారుకు హైకోర్టు మరో మొట్టికాయ వేసినట్లయ్యింది. హైకోర్టులో ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగలడం గతంలో ఏ ప్రభుత్వం చవిచూడని అంశం కావడంతో ప్రతి సందర్భంలోనూ ఈ విషయం ‘హైలైట్’ అవుతోంది.
Director Boyapati Srinu has caught attention with his latest political remarks, hinting at his voting…
ఏపీ పాఠశాల విద్యాశాఖ గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి మొత్తం 2,721 పోస్టులు భర్తీ చేయబోతోంది. వీటిలో…