
విస్తృతమైన పరీక్షలు రేపు ప్రారంభమవుతాయని ప్రభుత్వం చెబుతుంది. కేసులు ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీలోని దక్షిణ, పశ్చిమ మండలాల్లో విస్తృతమైన పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుండే ఇది మొదలు పెడతామని ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేంద్ర అంటున్నారు.
తెలంగాణ ఇప్పటివరకు 82,000 పరీక్షలు నిర్వహించింది. గత మూడు లేదా నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇదే సంఖ్యను నిర్వహించింది. గతంలో పది రోజులలో 50,000 టెస్టులు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా ఆ మాట నిలుపుకోలేకపోయారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఈసారి ఎంతవరకు మాట నిలబెట్టుకుంటుంది అనే అనుమానం అందరిలోనూ ఉంది.
పైగా కీలక తరుణంలో నాలుగు రోజుల పాటు టెస్టులు నిలిపివేశారు. మరోవైపు… ప్రభుత్వం ప్రకారం, ఇప్పటివరకు, 255 మంది ప్రభుత్వ సిబ్బంది, 31 ప్రైవేట్ హెల్త్ స్టాఫ్, మరియు 124 మంది పోలీసులను ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే అనధికార వార్తల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…