
అవును… ‘బర్నింగ్ స్టార్’ నటించబోతున్న తాజా చిత్రానికి ‘www.వైరస్.కాం’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ‘నో వ్యాక్సిన్ ఓన్లీ టాక్సీన్’ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమాను దుహర మూవీస్ సమర్పణలో ఎ.ఎస్.ఎస్.ఫిలింస్ బ్యానర్ పై సలీం, ధూళిపాళ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శివరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంపూకు జతగా గీత్ షా నటిస్తోంది.
పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకొంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వైవా రమేశ్, ‘జబర్దస్త్’ ఫేం చమ్మక్ చంద్ర ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సంపూ సినిమా సంగతులు ఎలా ఉన్నా, టైటిల్ తో మాత్రం సినీ ప్రేక్షకుల ఆసక్తిని రాబడుతున్నాడు.
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…