సూర్య లేదా చైతూతో త్రివిక్రమ్‌??

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం ఈయన నితిన్‌, సమంత జంటగా ‘అఆ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఆ సినిమాను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ప్రేమికుల రోజు సందర్బంగా 14న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ‘అఆ’ చిత్రం పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్‌ తన తర్వాత సినిమాను మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

త్రివిక్రమ్‌ తన తర్వాత సినిమాను తమిళ స్టార్‌ హీరో సూర్య లేదా నాగచైతన్యలతో చేసే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. గత కొంత కాలంగా సూర్య తెలుగులో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని భావిస్తున్నాడు. అయితే ప్రస్తుతం తమిళంలో వరుసగా పలు చిత్రాల్లో నటిస్తున్న సూర్య వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌ వరకు ఖాళీగా లేడు. మరి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించాలనే కోరికతో సూర్య తన డేట్లను అడ్జస్ట్‌ చేసుకునే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు. ఒక వేళ సూర్య డేట్లు కుదర్చలేక పోతే త్రివిక్రమ్‌ తన తర్వాత సినిమాను నాగచైతన్యతో చేస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మాటల మాంత్రికుడు ఏ హీరోతో సినిమా చేసినా ప్రేక్షకులు మాత్రం ఆ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూడటం ఖాయం.

Share
Published by

Recent Posts

Pakistan’s India Win Backfired? Ex-Captain’s Bombshell

Former Pakistan captain Mohammad Yousuf has linked the team’s recent struggles to their famous 10…

29 minutes ago

KTR Uses Jagan’s Famous Dialogue Again?

Why is Jagan is unusually good when it comes to picking interesting coin terms. There…

59 minutes ago