Telugu

‘డాడీ’ని ‘కిలాడీ’ చేసేసావు కదా… త్రివిక్రమ్..!

‘మాటల మాంత్రికుడు’ డైలాగ్ ల పవర్ ఏంటో మరోసారి తెలుగు సినీ ప్రేక్షకులు రుచి చూస్తున్నారు. ఇటీవల కాలంలో తన ‘పెన్’ పవర్ తగ్గిందన్న విమర్శలకు, ‘అ…ఆ…’ సినిమా ద్వారా బదులిచ్చాడు త్రివిక్రమ్. ‘అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలలో త్రివిక్రమ్ ‘ప్రాస’ల కోసం పడ్డ ‘ప్రయాస’లు స్పష్టంగా కనిపించాయి, వినిపించాయి. అయితే తాజా సినిమాలో మాత్రం అలాంటి పొరపాట్లు జరగకుండా… సందర్భానుసారంగా వచ్చిన డైలాగ్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తున్నాయి.

ADVERTISEMENT

సినిమా మొదలైన కొద్ది నిముషాలకు సమంత చెప్పే… ‘డాడీ… నువ్వూ కిలాడీ…’ అంటూ మొదలయ్యే మాటల మాంత్రికుడి మ్యాజిక్… చివర్లో రావు రమేశ్ పలికే ‘శత్రువులంటే ఎక్కడో ఉండరు… చెల్లెళ్ళు, కూతుళ్ళ రూపంలో సొంత ఇంట్లోనే ఉంటారు… రోడ్ వైండింగ్ లో సగం ఇల్లు కొట్టేసిన మాదిరి ఉంచుకోవాలో… వదిలించుకోవాలో… తెలియక సతమతమవుతున్నా…’ అంటూ త్రివిక్రమ్ పెన్ పవర్ కు ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ ధియేటర్లకు క్యూలు కడుతున్నారు.

ఒకప్పుడు హీరోయిజాన్ని చూడడానికి ప్రేక్షకులు ఎగబడేవారు. ఆ తర్వాత బాలకృష్ణ వంటి వారు చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ కోసం… కానీ, ఆ ఒరవడిని త్రివిక్రమ్ పూర్తిగా మార్చేసారు. ఈ ‘మాటల మాంత్రికుడు’ సినిమా విడుదల అవుతోంది అంటే… సినిమా ఎలా ఉన్నా… డైలాగ్స్ అదిరిపోతే చాలు… ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అయిపోతారు..! “అ…ఆ…” సినిమా విషయంలోనూ జరిగింది అదే!

కధ పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు… కానీ కధ లేదన్న విషయాన్ని మైమరపించే విధంగా త్రివిక్రమ్ డైలాగ్స్ ఉండడంతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ ధియేటర్ల నుండి బయటకు వస్తున్నారు. ‘డాడీ’ని ‘కిలాడీ’ చేసిన త్రివిక్రమ్… ‘బేబీమామ్మ’ అంటూ చావు దగ్గర కూడా నవ్వులు పూయించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అయితే… వీటన్నింటిని ఎంజాయ్ చేయాలంటే… ఖచ్చితంగా త్రివిక్రమ్ మాటల ప్రియులై ఉండాలి..! అప్పుడే కావాల్సినంత ‘కిక్’ ఇస్తాయి..!

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Vijay Sees a Global Winner in Ramayana!

Vijay Deverakonda has extended his wishes to the team of Ramayana: Part 1, expressing his…

19 minutes ago

#Balu Geetha Review: Marital Woes Test Your Patience

BOTTOM LINE Marital Woes Test Your Patience PLATFORM ETV Win RUNTIME 2 Hrs 11 Mins.…

29 minutes ago