
కొన్ని రోజుల క్రితం, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క ఆన్ లైన్ విడుదలకు ఫాన్సీ ఆఫర్ ఇవ్వడం విన్నాము. ఎక్సక్లూసివ్ గా ఆన్లైన్ హక్కుల కోసం దిల్ రాజుకు అమెజాన్ 110 కోట్ల ఆఫర్ ఇచ్చింది. అయితే దిల్ రాజు ఈ ప్రతిపాదనను తిరస్కరించాడట. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకుంటున్నాడు.
ప్రస్తుతానికి, అతను ఈ కోర్టు రూమ్ డ్రామాని జనవరి 14 న సంక్రాంతి స్పెషల్గా విడుదల చేయాలని చూస్తున్నాడు. వకీల్ సాబ్ బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన పింక్ సినిమా రీమేక్. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని బట్టి సినిమాలో మార్పులు చేర్పులు చేశారు. పవన్ కళ్యాణ్ కు సినిమాలో హీరోయిన్ ట్రాక్ కూడా యాడ్ చేశారు.
పవన్ కళ్యాణ్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఆమె అక్టోబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ లోకి ఎంటర్ కాబోతుంది. ఈ నటి గతంలో పబ్బన్ కళ్యాణ్ ను గబ్బర్ సింగ్ లో రొమాన్స్ చేసింది. తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. ఎంసిఏ వంటి సూపర్ హిట్ ని ఇచ్చిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…