
సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ప్లాన్ చేసిన సినిమా ఇప్పుడు అటకెక్కింది. మహర్షి తరువాత వంశీ ఎటువంటి సినిమా చెయ్యకుండా మహేష్ కోసమే వేచిచూశాడు. ఈ తరుణంలో వంశీ చెప్పిన కథ నచ్చలేదని మహేష్ ఆ ప్రాజెక్టు కాదు అన్నాడు. దీనితో వంశీ పని అయిపోయిందని అంతా భావించారు.
అయితే అనుకోకుండా అదృష్టం వంశీ ఇంటి తలుపు తట్టినట్టుగా అయ్యింది. చిరంజీవి లూసిఫర్ రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టుకి ఇప్పుడు వంశీని అనుకుంటున్నారట. మొన్న ఆ మధ్య ఆయన ఊపిరిని సక్సెస్ ఫుల్ గా డైరెక్ట్ చేశారు. అది కూడా ఒక రీమేక్ సినిమానే.
దీనితో వంశీ కెరీర్ కు ఇది లైఫ్ లైన్ అనే చెప్పుకోవాలి. చిరంజీవి – కొరటాల శివ క్రేజీ కాంబో మూవీ ఆగస్టులో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. దీనితో వంశీకి ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి కావాల్సినంత టైం ఉంటుంది.
లూసిఫర్ రీమేక్ కు మొదట్లో పరశురామ్ ని అనుకున్నారు. అయితే ఇప్పుడు అతనికి మహేష్ బాబుని డైరెక్టు చేసే అవకాశం రావడంతో ఆ అవకాశం వంశీ పైడిపల్లికి వెళ్ళింది. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే… వంశీ చెయ్యాల్సిన మహేష్ బాబు సినిమా కు పరశురామ్ కి వెళ్లినట్టు అయ్యింది. అంటే ఒకరకంగా ఒకరికొకరు ప్రాజెక్టులు మార్చుకున్నట్టు అయ్యింది.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…