
రసాపురం, అనకాపల్లి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీడీపీ అధిష్టానం ప్రతిపాదన పెట్టడంతో ఆయన ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాధా అనకాపల్లిపై మొగ్గుచూపుతున్నారని సమాచారం. రెండు నియోజకవర్గాలలోనూ కాపులు ప్రభావం ఎక్కువగానే ఉంది. అయితే సొంత జిల్లా కృష్ణా జిల్లాను వదిలి వేరే చోట పోటీ చెయ్యడం సాహసమనే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్.. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
సొంత జిల్లాను వదిలి వెళ్తున్న వంగవీటి రాధాకు విశాఖ ఏమాత్రం కలిసొస్తుందో వేచి చూడాల్సిందే మరి. రాధ పోటీ చేస్తే ఆయనను అనకాపల్లికే పరిమితం చెయ్యకుండా కాపులు ఎక్కువగా ఉండే అన్ని నియోజకవర్గాలలోను తిప్పాలని చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. అన్నీ కుదిరితే సాయంత్రం బయటకు రాబోయే తెలుగుదేశం మొదటి లిస్టులోనే వంగవీటి రాధా పేరు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం.
The general trend is that the urban population are generally slow and low when it…
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…