Telugu

వైకాపాకు వ్యతిరేకంగా వంగవీటి రాధా కాపు ఆత్మగౌరవయాత్ర?

విజయవాడ సెంట్రల్ సీటు నుంచి కాకుండా విజయవాడ తూర్పు లేదా బందరు పార్లమెంట్‌ నుంచి పోటీచేయాలనే సంకేతాలు ఇస్తుండడంపై ఆగ్రహంగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మూడేళ్ల పాటు పనిచేశాక సీటు మార్పు అవమానంగా భావిస్తోంది రాధా వర్గం అసహనంగా ఉంది.

[m9ad]

ADVERTISEMENT

వేరే పార్టీలోకి వెళ్లటం అనే అంశం పక్కన పెట్టి13 జిల్లాల్లో పర్యటన చేయాలనే అంశంపై సన్నిహితులతో వంగవీటి రాధా చర్చించారని సమాచారం. దీనికి కాపు ఆత్మగౌరవయాత్ర అనే పేరు పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే కాపులలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పలచన అవ్వడం ఖాయం. ఈ క్రమంలో జగన్ ఏం చెయ్యబోతున్నారు చూడాలి.

అధిష్టానం వైఖరిపై రెండు రోజులు వేచిచూడాలని రాధా భావించినా.అధిష్టానం దిగొచ్చే సూచనలు కనపడకపోవడంతో వంగవీటి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. బెజవాడ తూర్పు లేదా మచిలీపట్నంలో పోటీకి దిగే ప్రసక్తేలేదని స్పష్టం చేస్తున్న రాధా ఈ రోజు సాయంత్రం కానీ లేదా రేపు గానీ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

బెంగాల్ టైగర్ మమతని బిజేపి ఓడిస్తేనే… లేకుంటే…

ఈ నెల 9న కేరళ, అసోం, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరిగాయి కానీ వాటిపై పెద్దగా ఉత్కంఠ లేదు. నేడు…

34 minutes ago

Akshay-Rana Daggubati Film: Why Play with Fan’s Emotions?

Reports claiming that Akshay Kumar and Rana Daggubati are teaming up for a historical thriller…

59 minutes ago