విజయవాడ రక్తచరిత్ర “వంగవీటి”కి వర్మ శ్రీకారం!

80వ దశకంలో బెజవాడను వణికించిన హత్యా రాజకీయాలు ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. 1988, డిసెంబర్ 26వ తేదీన జరిగిన వంగవీటి మోహన రంగా హత్యోదంతంతో ఈ హత్యా రాజకీయాలు దూరమయ్యాయి. అయితే అసలు ప్రారంభమైంది “వంగవీటి రాధ వర్సెస్ దేవినేని మురళి” అన్నది బెజవాడ వాసుల్లో హల్చల్ చేసే సమాచారం.

ఇప్పుడు ఈ చరిత్ర అంతా వెండితెర రూపం సంతరించుకోబోతోంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ విజయవాడ “రక్తచరిత్ర”ను “వంగవీటి” అనే సినిమా పేరుతో తెరకెక్కించబోతున్నానని తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అనంతపురం ‘రక్తచరిత్ర’ను సక్సెస్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన వర్మ, ఈ బెజవాడ “రక్త చరిత్ర”ను ఏ విధంగా చూపించబోతున్నారనే కుతూహలం విజయవాడ వాసుల్లో కలగడం సహజమే.

ADVERTISEMENT

అందులోనూ ఇటీవల దేవినేని నెహ్రు – వంగావీటి రాధ చేసిన ప్రకటనలతో ‘వంగవీటి x దేవినేని’ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో వర్మ చేసిన ప్రకటన మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది. అయితే ఈ టైటిల్ ప్రకటనలో ‘ట్విస్ట్’లేమీ ఉండవు కదా! అంటున్నారు నెటిజన్లు. వర్మ కదా… ఏదైనా చెప్పలేం మరి!

Share
Published by

Recent Posts

What To Watch on OTT This Week?

The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…

11 minutes ago

Players Discriminated Against by Selectors? Dhawan Speaks Out

Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…

41 minutes ago