
ఇదే విషయం అనిల్ కు వరుణ్ చెప్పేశాడట. నిజానికి ఎఫ్2 విక్టరీ వెంకటేష్ షో… వరుణ్ తేజ్ ది చాలా చిన్న పాత్ర. ఆ సినిమా చేసే సమయానికి వరుణ్ తేజ్ పరిస్థితి వేరు.. ఇప్పుడు వరుణ్ తేజ్ పెద్ద స్టార్. ఈ సమయంలో ఆ సినిమా చెయ్యడానికి అతనికి ఇంటరెస్ట్ లేదట. దీనితో ఎలా అని దిల్ రాజు, అనిల్ రావిపూడి తలలు పట్టుకుంటున్నారట.
ఎఫ్3 లో వేరే స్టార్ ని పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ పోతాది… పైగా సీక్వెల్ కి ఆ అంతేంటిసిటీ కూడా రాదు. పైగా ఇప్పటికిప్పుడు ఇంకో హీరోని ఒప్పించడం కూడా కష్టమే. సమ్మర్ 2021 కోసం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి బృందం ఆసక్తిగా ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని 2021 మే 14 న విడుదల చేయాలనేది ప్రణాళిక.
తమన్నా మరియు మెహ్రీన్ కూడా ఈ రెండవ భాగంలో ఉంటారు. ఈ సినిమా హాస్యనటుడు సునీల్ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో చేరనున్నట్లు వర్గాలు చెబుతున్నాయి అయితే అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. తన కెరీర్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని అతికొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపుడి ఒకరు. ఎఫ్ 2 అప్పటికి అతని కెరీర్ లో భారీ హిట్. ఆ తరువాత మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ తో 100 కోట్ల షేర్ సినిమా కూడా ఇచ్చాడు అనిల్. చాలా కాలం తరువాత ఎఫ్2లో వెంకటేష్ కామెడీ ఇరగదీశాడు. కాబట్టి ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ పై హైప్ మరియు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
Sai Dharam Tej’s wedding is back in the news, and this time, reports are even…
Mythri Movie Makers continues its focus on concept-oriented movies with its next outing, Donga Naa…