Telugu

వర్మపై విరుచుకుపడ్డ వీరప్పన్ సతీమణి!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై గంధపు చెక్కల స్మగ్లరు వీరప్పన్ భార్య మండిపడ్డారు. తన భర్త గురించి వర్మకు ఏమి తెలుసని, తన ఇష్టం వచ్చినట్టు కట్టు కథలను అల్లుతూ సినిమా తీశాడని నిప్పులు చెరిగింది. వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు వర్మ తెరకెక్కించిన చిత్రం తమిళంలో ‘విల్లాది విల్లన్ వీరప్పన్’గా విడుదల నేపధ్యంలో ముత్తులక్ష్మి మీడియా ముందుకు వచ్చారు.

ఈ సినిమాను ఎవరూ చూడొద్దని, ఇందులో కథ వీరప్పన్ జీవితానికి పూర్తి భిన్నంగా ఉందని ధ్వజమెత్తారు. హిందీలో ‘వీరప్పన్’ చిత్రం తీస్తున్నట్లు తనకు చెప్పిన వర్మ, ఇప్పుడు అన్ని భాషల్లో తన అనుమతి లేకుండా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. వీరప్పన్ వ్యక్తిగత జీవితం గురించి ఆయనతో పాటు నాలుగేళ్ళు గడిపిన తనకు తప్ప మరెవ్వరికీ తెలియదని, ఆయన అజ్ఞాతంలో ఉన్నా ఏ తప్పూ చేయలేదని ముత్తులక్ష్మి పేర్కొన్నారు.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

Mirzapur BO Day 2: Star Power Finally Dead in Bollywood?

Mirzapur: The Movie has unexpectedly taken a good start at the box office. While doubts…

24 minutes ago

H-1B Employer Fights Workers Over Unpaid Salaries

A video shot in an unknown office in Dallas, Texas has gone viral, and has…

44 minutes ago