
శ్రీకాంత్ అడ్డాల డైరెక్టు చేస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్కు పూర్తి అయ్యిందట. స్వల్ప మార్పులు మన నేటివిటీకి తగ్గట్టుగా చేశారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 2 నుండి హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో మొదలు కాబోతుంది. అయితే దానికి ఒక రోజు ముందే సినిమా ఫస్ట్ లుక్ జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేస్తారని సమాచారం.
షూటింగ్ మొదలు కాకముందే ఫస్ట్ లుక్ అంటే విశేషమే. సాఫ్ట్ చిత్రాల దర్శకుడైన శ్రీకాంత్ అడ్డాలను ఈ సినిమాకు ఫైనల్ చెయ్యడం అంటే సాహసం అనే అనుకోవాలి. శ్రీకాంత్ అడ్డాల గతంలో వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పని చేశారు. చివరి సారిగా మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం అనే అట్టర్ ప్లాప్ సినిమా చేశాడు.
ఆ తరువాత ఆయనకు అవకాశాలు రాలేదు. వేసవిలో విడుదలకు ప్రణాళికలు రచిస్తున్నారు. తమిళంలో ధనుష్ నటించిన ఈ సినిమా ఈ ఏడాదిలో వచ్చిన మేటి సినిమాలలో ఒకటి అని విమర్శకులు సైతం కీర్తిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో ఏ మాత్రం న్యాయం చెయ్యగల్గుతారో చూడాల్సి ఉంది.
This week's theme on the Bigg Boss Telugu reality show is GOAT. The house is…
సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని టీడీపీ నేతలు ఎంతగా బల్ల గుద్ది వాదించినా స్థానిక సంస్థల ఎన్నికలు…