
మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాజాగా మరికొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది చిత్ర యూనిట్. వెంకటేష్ మాత్రమే ఉన్న ఈ ఫోటోలు, విక్టరీ అభిమానులకు ‘విజయం’ కళ్ళ ముందు ఉన్నట్లుగా కనపడుతోంది. ముఖ్యంగా తెల్ల చొక్కా వేసుకుని నడిచి వస్తున్న ‘బాబు’ను చూస్తూ నిజంగా ‘బంగారం’ లాగానే ఉన్నాడు అంటున్నారు వీక్షకులు.
జూలై 9వ తేదీన ఆడియో విడుదల కానుండగా, అదే నెల మూడవ, లేక చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయిదు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఏంటి ఈ అరాచకం… అని అసూయ పడేటంతగా అలరిస్తున్నాడు వెంకీ. బహుశా ‘మన్మధుడు’ నాగార్జునకు పోటీగా రానున్నాడేమో!
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. కనుక ఆ మూడు పార్టీల నేతలు ఆ లెక్కలు కట్టుకుంటూ,…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu criticised YSRCP president YS Jagan Mohan Reddy over…