
మరోవైపు ఈ సినిమాను అక్టోబర్ 4న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 4న విడుదల సరిగ్గా చిరంజీవి సైరా సినిమా విడుదలైన రెండు రోజులకు. ఒకరకంగా ఇది సాహసమే అని చెప్పుకోవాలి. అయితే రెండు వేరే వేరే జోనర్ సినిమాలు పైగా దసరా సెలవుల వల్ల తమకు కలిసి వస్తుందని వెంకీ మామ నిర్మాతలు భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో కలిసి నటిస్తున్నారు.
దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా… నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ స్వరకర్త. ఎఫ్2 తో వెంకటేష్, మజిలీతో నాగచైతన్య మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ చిత్రంతో దానిని కొనసాగించాలని అనుకుంటున్నారు.
ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…
Nani’s The Paradise is facing another round of backlash after its Netflix premiere. The film…