Telugu

అన్ సీజన్లో వెంకీ మామ

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’ షూటింగ్ చివరి ఘట్టానికి చేరుకుంది. చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఒక్క పాట తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. తొలుత ఈ సినిమాను అక్టోబర్ 4న దసరా సందర్భంగా సినిమాను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారు అయితే 2న విడుదలయ్యే మెగాస్టార్ చిరంజీవి భారీ చిత్రం సైరా నరసింహారెడ్డితో క్లాష్ కాకుండా వాయిదా వేశారు.

తాజాగా అక్టోబర్ 25న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. అయితే ఈ నిర్ణయం అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు. హాలిడేస్ వదిలేసి అన్ సీజన్లో సినిమా విడుదల చెయ్యడం ఏంటో అని వారు నిటూరుస్తున్నారు. అక్టోబర్ 25 విడుదల అంటే దీపావళి స్పెషల్ గా సినిమా వస్తుంది. కానీ ఈ సారి దీపావళి ఆదివారం వచ్చింది. చాలా చోట్ల దీపావళికి సెలవు లేదు. దీనితో అది పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదు. పైగా దీపావళి ఆదివారం రావడం వల్ల ఆదివారం కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది.

ADVERTISEMENT

ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా… నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. తన మొదటి సినిమా పవర్ తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ వంటి డిజాస్టర్ సినిమా తీశాడు బాబీ. ఆ తరువాత వచ్చిన జై లవకుశ కూడా యావరేజ్ సినిమానే. దీనితో ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Varun-Janhvi’s Teaser: Even More Cringe Than VD-Rashmika?

The glimpse of Koffee With Karan’s upcoming episode is out now. It will feature Varun…

33 minutes ago

Nivin Pauly’s Box Office Run Takes a Sudden Turn

Malayalam cinema remains unpredictable, as a film’s box-office performance often depends more on its content…

2 hours ago