
గురు చిత్రం తో నటుడిగా విక్టరి వెంకటేష్ ఎంత కమిటెడ్ గా ఉంటాడో ఆడియన్స్ కు మరోసారి తెలియ చెప్పాడు. తాజాగా దర్శకుడు తేజ తో ఒక కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. తమ సొంత బ్యానర్ లో చేస్తున్న ఈ చిత్రానికి `ఆట నాదే వేట నాదే` అనే పేరు ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. సురేష్ బాబు తో పాటు.. అనిల్ సుంకర సహ నిర్మాతగా చేస్తున్నారు. ఈ చిత్రం ఓపెనింగ్ సోమవారం హైదరాబాద్ లో జరిగింది.
కుటుంబ అనుబంధాల నేపధ్యంగా సాగే థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. డిసెంబర్ 13న వెంకటేష్ బర్తడే సందర్భంగా రెగ్యులర్ షూట్ చేస్తారు. మరి అబ్బాయి రానా తో నేనే రాజు నేనే మంత్రి చిత్రం చేసి హిట్ అందుకున్న తేజ.. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ వెంకటేష్ వంటి ఒక స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు. వెంకటేష్ ఫ్యాన్స్ కు తేజ ఏరేంజ్ హిట్ ఇస్తాడో తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే మరి.
Municipal polling across Andhra Pradesh recorded 48.03% voter turnout by 3 PM on November 1.…
ఏళ్ల తరబడి వైసీపీకి కంచుకోటగా ఉన్న పులివెందులలో ఈసారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ప్రశాంతంగా ఓటు వేసేందుకు వస్తున్న…