Telugu

జయలలిత జీవితంలో ఆ కోణాన్ని కూడా చూపిస్తారా?

స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందులో కంగనా రనౌత్ హీరోయిన్ గా తలైవి అనే చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషలలో నిర్మితం అవుతుంది. ఈ సినిమాలో శోభన్ బాబు పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదించినట్టు సమాచారం.

ADVERTISEMENT

విజయ్ ఈ తరం అమ్మాయిల కలల రాకుమారుడైతే శోభన్ కొన్ని సంవత్సరాల పాటు సోగ్గాడిగా అమ్మాయిలకు నిద్రలేకుండా చేసేవారు. దీనితో విజయ్ ఆ పాత్రకు సరైన ఛాయస్ అని అంటున్నారు. అయితే ఈ పాత్రను చిత్రంలో ఏ మేరకు చూపిస్తారు అనేది చూడాలి. శోభన్ బాబు జయలలిత అనేక సినిమాలలో కలిసి నటించారు.

అంతే కాకుండా వారిద్దరి నిజజీవిత రిలేషన్ గురించి అనేక వార్తలు ఉన్నాయి. ఆ కోణం సినిమాలో ఏమైనా చుపిస్తారేమో చూడాలి. అయితే సినిమాలో జయ రాజకీయ జీవితాన్నే ఎక్కువ టచ్ చేస్తే ఆ పార్టుని అసలు ముట్టుకోకపోవచ్చు. జయలలిత ఇష్టసఖిగా ప్రియమణి కనిపిస్తుందట.

ఇటీవలే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను నిరాశపరచిందనే చెప్పుకోవాలి. ఈ తరుణంలో సినిమాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. అమల పాల్ మాజీ భర్త ఏఎల్ విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను ఇచ్చారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ఎవరి బాబు నీళ్ళవి? నిజమే ఎవరి బాబువి కావు!

తెలంగాణలో కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో బీఆర్ఎస్‌ పార్టీ నిత్యం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నామస్మరణ…

30 minutes ago

CBN, PK Meet Again Over MPTC, ZPTC Seat Sharing

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan have reportedly…

42 minutes ago