
ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) రేపు వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 23న ఆయన నామినేషన్ వేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే వైకాపా తరఫున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఆ తరువాత ఆయన పవన్ కళ్యాణ్ కు దగ్గరగా చేరి టీడీపీలో టిక్కెట్ కోసం ప్రయత్నం చేశారు.
అయితే అది కూడా కుదరలేదు. దీనితో 2014లో ఆయన పోటీ చెయ్యలేదు. జగన్ కేసులలో ఒకటి రెండు కేసులలో పీవీపీ కూడా నిందితుడు కావడం విశేషం. విజయవాడ సిట్టింగు ఎంపీ కేశినేని నానికి ప్రజలలో మంచి పేరు ఉంది. ఆర్ధికంగా కూడా గట్టి అభ్యర్థి. ఆయనను ఢీకొట్టడానికి అదే సామజిక వర్గానికి చెందిన పీవీపీని తెర మీదకు తెచ్చారు జగన్. నానిని పీవీపీ అడ్డుకోగలరేమో చూడాలి. నాని ఇప్పటికే విజయవాడలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం కూడా మొదలు పెట్టేశారు.
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…
The latest buzz around Srinivasa Mangapuram, reportedly featuring Mahesh Babu’s nephew, has once again brought…