Telugu

కోహ్లి టీంకు ఏమైంది… 4 ఓవర్లలో 5 అవుట్లు మిస్..!

ఆడిన 7 మ్యాచ్ లలో 5 ఓటములు, 2 గెలుపులు మాత్రమే అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తీవ్ర నిరాశలో ఉంది. ఇలాంటి తరుణంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ధోని టీంతో అమీతుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగిన కోహ్లి సారధ్యంలోని బెంగుళూరు జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

మరోవైపు ధోని జట్టు కూడా తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో దూకుడైన ఆటతీరుతో బెంగుళూరు బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. అయితే మూడవ ఓవర్లో ఖ్వాజా రనౌట్ రూపంలో వెనుదిరిగిన తర్వాత బరిలోకి దిగిన సౌరభ్ తివారీని మూడు సార్లు అతి తేలికగా అవుట్ చేసే అవకాశాన్ని బెంగుళూరు టీం వదిలేసుకుంది.

ADVERTISEMENT

వరుణ్ ఆరోన్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ కవర్ షాట్ ద్వారా తివారీ ఇచ్చిన క్యాచ్ ను స్టువర్ట్ బిన్నీ జారవిడిచాడు. మరో ట్విస్ట్ ఏమిటంటే… ఆ మరుసటి బంతికి ఆఫ్ సైడ్ కట్ చేయబోయి, సచిన్ బేబీకి మరో తేలిక క్యాచ్ అందించాడు తివారీ. దాన్ని కూడా వదిలిపెట్టడంతో బెంగుళూరు టీంకు ఏం జరుగుతోంది…? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ క్యాచ్ లను వదిలే పరంపర ఇక్కడితో ఆగలేదు.

మరుసటి ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీకి రెహనే ‘కాట్ అండ్ బౌల్’ అవకాశం ఇచ్చాడు. కాస్త కష్టసాధ్యమైన క్యాచ్ అయినప్పటికీ దీనిని కూడా ఒడిసిపట్టుకోవడంలో బిన్నీ విఫలమయ్యాడు. ఆ మరుసటి ఓవర్ వేసిన వరుణ్ ఆరోన్ మొదటి బంతికి మరొక తేలిక క్యాచ్ ను అందించాడు రెహనే. చాలా సేపు గాల్లో ఉన్న బంతిని అందుకోవడంలో మీమాంస చెందిన వాట్సన్ తేలిక క్యాచ్ ను అందుకోలేకపోయాడు.

ఇక్కడితో కూడా బెంగుళూరు టీం ఫీల్డింగ్ ప్రతిభ ముగియలేదు. తర్వాత ఓవర్ వేసిన చాహల్ స్పిన్ కు బోల్తా పడ్డ తివారీ, కీపర్ కు అతి తేలికైన స్టంపింగ్ అవకాశం అందించాడు. దీన్ని కూడా వదిలేయడం రాయల్స్ ఫీల్డింగ్ ప్రతిభకు నిదర్శనం. వీటితో పాటు బౌండరీ లైన్ల వద్ద రెండు ఫోర్లను, రన్ అవుట్ల అవకాశాల కోసం మరికొన్నింటిని, వదిలేసి కెప్టెన్ కోహ్లికి తీవ్ర మనోవేదనను మిగులుస్తున్నారు. ఇదంతా కూడా మొత్తం అయిదారు ఓవర్ల వ్యవధిలో జరగడంతో చూస్తున్న వీక్షకులే కాదు, విస్తుపోవడం కామెంటేటర్లు వంతయ్యింది.

Share
Published by

Recent Posts

Pics: Amiksha Sizzles In Olive Green Saree Look

Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…

26 minutes ago

ఇది ఖచ్చితంగా రాజకీయ ఆత్మహత్యే కదా?

రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే మాట తరచూ వినబడుతూ ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ పదవి…

42 minutes ago