Telugu

ధోని డబ్బులు అడిగాడు… కోహ్లికి కోపం వచ్చింది..!

51 బంతుల్లోనే 82 పరుగులు చేసి ఒంటిచేత్తో భారత్ ను సెమీస్ కు చేర్చిన విరాట్ కొహ్లి తనకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సిందేనని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. “తాను సింగిల్ తీద్దామని అనుకున్నప్పుడల్లా కొహ్లి రెండో పరుగు కావాలని అరిచేవాడని, దీంతో అతనితో సమానంగా తానూ పరుగులు పెట్టానని, కోహ్లీ ఆటతీరు అద్భుతమని, ఇదే సమయంలో తనతో వికెట్ల మధ్య అలసట వచ్చేలా పరుగులు పెట్టించి, ఆ పరుగులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ తనకు డబ్బులు ఇవ్వాలని, ఓ రన్నర్ ఎదురుగా ఉంటే ఎలా పరుగులు దొంగిలించవచ్చో కొహ్లి చేతల్లో చూపాడని” సరదా వ్యాఖ్యలు చేసాడు ధోని.

ఇదిలా ఉంటే… అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న విరాట్ కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. దానికి కారణం తెలుసా? ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడి విజయాన్ని అందించినందుకు ఓ పక్క పొగడుతూనే, అనుష్క శర్మతో విడిపోయిన తరువాత నీ ఆట బాగుందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్ల మీద కామెంట్లు పెడుతుంటే విరాట్ కు కోపం వచ్చి తన ట్విట్టర్ ఖాతా ద్వారా మండిపడ్డాడు. అనుష్కను అలా ఎందుకు విమర్శల పాలు చేస్తున్నారని, తనెప్పుడూ పాజిటివ్ గా మద్దతిచ్చిందని, ‘షేమ్’ అని రాసి ఉన్న ఒక చిత్రాన్ని పోస్టు చేశాడు. కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన ఈ కోహ్లీ, అనుష్కల జంట ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Viral Interview Clip Exposes Big Stars’ Hidden Secrets?

Actor Soori is currently doing round the clock promotions for his upcoming film Mandaadi, which…

30 minutes ago

Sai Reddy Bigger Threat Than Sharmila For Jagan?

Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…

60 minutes ago