Telugu

‘హీరోయిన్ల’తో ఉన్న ఇబ్బంది గురించి చెప్పిన ‘హీరో’

‘రాయుడు’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తమిళ హీరో విశాల్ తన సహచర హీరోయిన్ల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ముఖ్యంగా తన ఎత్తుకు మ్యాచ్ అయ్యే హీరోయిన్లు దొరకడం కష్టమైపోతుందని ఆవేదన చెందిన విశాల్… తెలుగు భామ శ్రీదివ్య హైట్ తో మాత్రం తనకు ఇబ్బంది రాలేదని అభిప్రాయ పడ్డారు. కానీ, మా ఇద్దరిని ఒకే ఫ్రేంలో మ్యాచ్ చేయడానికి కెమెరామెన్ కు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు.

తను సింగిల్ ఫ్రేంలో ఉన్నపుడు ఎలాంటి డైలాగ్ అయినా యాపిల్ మొబైల్ ను ఎదురుగా పెట్టుకుని పూర్తి చేసేస్తానని, అయితే హీరోయిన్లతో కాంభినేషన్ సీన్లు ఉన్నప్పుడు మాత్రం కాస్త కష్టమవుతోందని విశాల్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు తనతో నటించిన హీరోయిన్లలో హైట్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేని హీరోయిన్లు శృతిహాసన్, రీమాసేన్ తోనని చెప్పిన విశాల్, వారిద్దరితో నటించడం సౌకర్యంగా ఉంటుందని అన్నారు. అయితే, తన ఎత్తుకు తగిన హీరోయిన్ కావాలని కోరడం కూడా అత్యాశేనని తన హీరోయిన్ వ్యధలను మీడియా వేదికగా వెల్లడించారు.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Karan Johar Sidelined Regina for Being a South Indian?

The debate over Bollywood actresses' comments on South Indian cinema has taken another turn. After…

43 minutes ago

అయ్యో పాపం చెవిరెడ్డి… పులివర్తి సుధా రెడ్డి ర్యాగింగ్!

నేడు తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనూహ్య సంఘటన జరిగింది. పరిషత్ ఎన్నికల్లో దాదాగిరి చేద్దామని వచ్చిన మాజీ మంత్రి చెవిరెడ్డి…

1 hour ago