
వెంకటేష్ రీమేక్ కాబట్టి అవకాశమిచ్చారు. నారప్ప తో ప్రూవ్ చేసుకోవడానికి థియేటర్లో విడుదలయ్యే సినిమా కాదు. ఒకవేళ విడుదలైన రీమేక్ సినిమాలకు దర్శకులకు వచ్చే క్రెడిట్ చాలా తక్కువ. ఈ తరుణంలో తన తదుపరి చిత్రంగా అన్నాయి అని ప్రకటించారు అడ్డాల. ఇది మూడు భాగాలుగా రాబోయే పీరియడ్ సినిమా.
1970-80ల సమయంలో జరిగే కథ. ఏ హీరో అయినా ఒక దర్శకుడిని నమ్మి మూడు భాగాలకు తన డేట్స్ ఇవ్వడం ఈజీ కాదు. పైగా అడ్డాల ఉన్న ఫామ్ కారణంగా అంత ఈజీ కాదు. పైగా ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తా అని స్టార్ హీరో చేసే యాక్షన్ సినిమా అని అంటున్నారు.
తెలుగులో ఇప్పట్లో మూడు భాగాల సినిమా రాలేదు. బాహుబలి రెండు భాగాలుగా వచ్చింది. ఇప్పుడు పుష్ప కూడా రెండు భాగాలే. మూడు భాగాలు అంటే అంత తేలిక కాదు. ఇలాంటి తరుణంలో శ్రీకాంత్ అడ్డాలను అల్లు అరవింద్ నమ్ముతారా? ఆయన నమ్మినా అన్ని డేట్స్ ఇచ్చే స్టార్ హీరో ఎవరా అనేది చూడాలి. రేపటికి దీని మీద ఒక క్లారిటీ రావొచ్చు.
After a couple of postponements, Venkatesh’s Aadarsha Kutumbam is finally set to release on October…
Divine action seems to be slowly becoming a trend in Tollywood. These days, even when…