
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను పరిశీలస్తే… సభలో ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్ వ్యవహరిస్తున్న తీరు వారిని నమ్మి ఓటు వేసిన ప్రజలను అవమానిస్తున్నట్లుగా ఉందని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాల వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించి.., ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రజల తరపున నిలబడడం ప్రతిపక్ష పార్టీ కనీస బాధ్యత. కానీ, జగన్ ఏం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా గమనిస్తూనే ఉన్నారు.
ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కొదవలేదు. రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ అనేక సమస్యలకు నిలయంగా ఏపీ ఉన్న విషయం తెలిసిందే. అయితే జగన్ వాటన్నింటిని వదిలిపెట్టి అసెంబ్లీలో అసభ్య పదజాలం వినియోగించిన ఒక ప్రజా ప్రతినిది కోసం సభ సమయం మొత్తం వృధా చేస్తున్నారనే భావనకు ప్రజలను తీసుకువస్తున్నారు. తన పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసం అసెంబ్లీకి వస్తున్నారా? లేక ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందు ఏకరువు పెట్టడానికి సభకు వస్తున్నారో ఓ సారి వెనుతిరిగి చూసుకోవాలని సగటు సామాన్యుడు కోరుకొంటున్నాడు.
ప్రజల తరుపున పోరాడడానికి వైసీపీ సభ్యులకు ఎన్నో అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా చదువుల కోసం ఫీజుల రూపంలో తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో డొనేషన్ల పేరుతో స్కూల్ యాజమాన్యం వారు అనుసరిస్తున్న విధానాల గురించి, వేసవిలో మండుతున్న ఎండల గురించి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, రాజధాని అభివృద్ధి అంశంపై, కేంద్రం నుండి రావాల్సిన సాయం, పోలవరం ప్రాజెక్ట్ అంశం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రత్యేక హోదా… ఇలా ప్రజలకు ఉపయోగాపడే లెక్కకు మించిన అంశాల మీద ప్రభుత్వంపై పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు తెలిపితే ప్రజలకు ప్రతిపక్ష పార్టీపై విశ్వాసం పెరుగుతుంది. ఇలాంటి పోరాటాలకు ప్రజల మద్దతు కూడా ప్రతిపక్ష పార్టీకి దక్కుతుందన్న విషయం గమనించాలి.
ప్రజా ఉపయోగాలకు కాకుండా జగన్ అసెంబ్లీని స్వప్రయోజనాలకు వినియోగించుకొంటే మాత్రం జగన్ కలలు కంటున్నట్లు అధికారంలోకి కాదు కదా కనీసం ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష హోదా కుడా దక్కకపోవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. నిజానికి పార్టీ ఇంటర్నల్ టాక్ కూడా ఇదేనని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…
Akshay Kumar is facing criticism on social media after an unexpected moment on Kaun Banega…