
ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో హీరోయిన్ గా అప్పట్లో ప్రగ్య జైస్వాల్ పేరు వినిపించింది. అయితే తాజాగా కియారా అద్వానీ పేరు పవన్ కల్యాణే స్వయంగా సూచించాడట. గతంలో కియారా తెలుగువారికి భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో పరిచయమే. అయితే ఆ తరువాత ఆమె బాలీవుడ్ లో కబీర్ సింగ్ సక్సెస్ తో బిజీ అయిపోయింది.
ఈ మధ్య కాలంలో కొంత మంది తెలుగు నిర్మాతలు సంప్రదించినా స్పందించడం లేదు. డేట్స్ లేవని చెప్పేస్తుంది లేకపోతే భారీగా రెమ్యూనరేషన్ అడిగి భయపెట్టేస్తుంది. దీనితో పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. సహజంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే వదులుకునే హీరోయిన్లు అసలు ఉండరు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోతున్నారట. మొఘలాయిల కాలానికి సంబంధించిన కథ ఇది. మహమ్మదీయుల పరిపాలనా కాలం, అప్పటి పరిస్థితులు… ఇవన్నీ తెరపై చూపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం ఆయనకు ఇదే మొదటి సారి.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…