
ఇప్పటివరకు కనీసం 50 కోట్ల క్లబ్ లో కూడా లేని జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ ‘ఆల్ టైం’ బ్లాక్ బస్టర్ ను అందుకునే సత్తా ఉందా? సరైన సినిమా పడితే ‘బుడ్డోడు’ విశ్వరూపం చూపిస్తాడనేది అభిమానుల మాట. అయితే, ఏపీ, తెలంగాణాలలో మాత్రం జూనియర్ కు తిరుగులేదు, ఇక మిగతా ఏరియాల్లో అయితే కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన గత నాలుగు సినిమాలకు ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. అయితే ఓపెనింగ్ డే నాడు దుమ్ము దులిపినా… సినిమాకు వస్తున్న టాక్ రీత్యా రెండవ రోజు నుండి బాక్సాఫీస్ వద్ద చతికిలపడటం అందరికీ తెలిసిన విషయమే.
అయితే గత సినిమాల కంటే ఎక్కువ రేంజ్ లో “నాన్నకు ప్రేమతో” సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఒకవేళ సినిమాకు ఆశించినంత టాక్ రాకపోతే మరో ఆలోచనకు ఆస్కారం లేదు గానీ, అభిమానులు, చిత్ర యూనిట్ అంచనా వేసిన విధంగా “నాన్నకు ప్రేమతో” సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, “శ్రీమంతుడు” సినిమాను కొల్లగొడుతుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది. 2003లో విడుదలైన “సింహాద్రి” తర్వాత బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఘనత లేని జూనియర్ ఎన్టీఆర్ ‘బ్లాక్ బస్టర్’ రేంజ్ ను 2016లో అంచనా వేయడం సబబేనా? అంటే ఖచ్చితంగా కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ‘బుడ్డోడు’ పరిస్థితి ఏమిటి? అంటే మరోసారి తనను తనూ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయ పడుతున్నారు.
విమర్శకులతో పాటు అభిమానులకు, సినీ ప్రేక్షకులకు జూనియర్ తన సత్తాను చాటి చెప్పాల్సిన తరుణంలో “నాన్నకు ప్రేమతో” విడుదల అవుతోంది. ఫాదర్ సెంటిమెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “నాన్నకు ప్రేమతో” హిట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కు మరో లబ్ధి కూడా చేకూరుతుంది. ఇప్పటివరకు సొంతం కానీ ఫ్యామిలీ ప్రేక్షకగణం జూనియర్ సొంతం కావచ్చు. మరి ‘స్వామికార్యం – సకార్యం’ రెండు ఒకేసారి పూర్తయ్యే అవకాశం ఉన్న “నాన్నకు ప్రేమతో” సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఆశలను నిలుపుతుందా? అన్నీ అనుకూలిస్తే బహుశా జనవరి 12వ తేదీన యుఎస్ లో పడనున్న ప్రీమియర్ షోతో “నాన్నకు ప్రేమతో” సినిమా పరిస్థితి తెలిసిపోవచ్చు. ఫ్యాన్స్ అయితే ఈ సారి ‘బుడ్డోడు’దే హవా అంటున్నారు. మరి వారి విశ్వాసాన్ని కూడా ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.
Anil Ravipudi’s comments at the Irumudi success meet have opened up an interesting debate about…
చిత్రం: ఎపిక్ M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 11, 2026 తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,…