
దాదాపు 55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే చేసింది. అయితే బిజినెస్ మాట పక్కన పెడితే, ఈ సినిమాకు అయిన బడ్జెట్ తిరిగి వస్తుందా… అన్న రీతిలో ట్రేడ్ వర్గాలు విశ్లేషణలు చేస్తున్నాయి. తొలిరోజు వరకు ఎటువంటి డోకా లేదు గానీ, రెండవ రోజు రెండు సినిమాలు, మూడవ రోజు మరో పెద్ద సినిమా ఉండడంతో ఏ మేరకు ‘యంగ్ టైగర్’ వసూళ్ళు సాధిస్తారనేది ప్రశ్నార్ధకంగా ఉంది.
ఇప్పటివరకు 50 కోట్ల క్లబ్ ఎరుగని జూనియర్, ఈ చిత్రం ద్వారా ఆ ముచ్చట తీర్చుకోవాలని భావించారు. దానికి తగ్గట్లే సినిమాకు మాంచి హైప్ కూడా క్రియేట్ చేసారు. తొలిరోజు స్పందన కూడా భారీగానే ఉంది. అయితే పబ్లిక్ నుండి వ్యక్తమైన టాక్ రీత్యా ఈ సారైనా జూనియర్ 50 కోట్ల మార్క్ ను అందుకుంటాడా? ఒకవేళ అందుకున్నా సినిమాకు పెట్టిన నిర్మాణ వ్యయాన్ని రాబడతాడా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓవర్సీస్ లో క్లిక్ అయితే కొంత మేరకు చిత్ర యూనిట్ గట్టేక్కవచ్చని టాక్.
“నాన్నకు ప్రేమతో” భవితవ్యం రేపు విడుదల కాబోయే “డిక్టేటర్” మరియు ఆవలి రోజున వస్తున్న “సోగ్గాడే చిన్నినాయనా” చిత్ర ఫలితాలపై ఆధారపడి ఉందన్నది సినీ విశ్లేషకుల మాట. సంక్రాంతి సెలవుల రీత్యా ఈ వీకెండ్ వరకు వసూళ్ళు డోకా ఉండకపోవచ్చు గానీ, ఇతర సినిమాలతో పోటీ రీత్యా ఆ కలెక్షన్స్ ఏ స్థాయిలో వస్తాయన్నది వేచిచూడాలి. ఫుల్ పిక్చర్ రావాలంటే ఈ వీకెండ్ ముగియాల్సిందే!
A leaked video of actor Jayam Ravi and his ex-girlfriend Keneeshaa smoking an illegal drug…
PVR Cinemas has added a very familiar Indian snack to its food menu, but the…