
ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితం సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే కొన్ని కట్స్ కూడా చెప్పింది. ఆ కట్స్ చూస్తే సినిమాలో మసాలా కంటెంట్ బాగానే దట్టించినట్టు అనిపిస్తుంది.
నిన్న సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వద్ద విజయ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. “ఈ సినిమాతో మీకు సరికొత్త ఎక్సపీరియెన్స్ కలుగుతుంది. దానికి నా గారంటీ,” అని చెప్పుకొచ్చి అభిమానులలో అంచనాలు పెంచేశాడు. ఇది ఇలా ఉండగా 2018లో వచ్చిన గీత గోవిందం తరువాత విజయ్ కు సరైన హిట్ లేదు. టాక్సీవాలా ఒక మాదిరిగా ఆడిన విజయ్ నుండి ఆశించే రేంజ్ అయితే కాదు.
దీనితో ఈ సినిమా మీద విజయ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే ఫిబ్రవరి లాంటి డల్ పీరియడ్ లో సినిమా విడుదల కావడం ప్రతికూలాంశం. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లతో నాలుగు లవ్ ట్రాక్స్ ఉంటున్నట్టు తెలుస్తుంది.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…