
ఈ నేపథ్యంలో స్వయంగా జగనే రంగంలోకి దిగినట్లుగా సమాచారం. ఈ ఒరవడిని ఆపకుంటే మున్ముందు మరింత మంది పార్టీని వీడడం ఖాయమని భావించిన జగన్, పూర్తి ఆత్మరక్షక ధోరణిలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. దీంతో అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్, పార్టీ మారే అవకాశముందని భావిస్తున్న ఎమ్మెల్యేలకు గురువారం సాయంత్రం నేరుగా తనే ఫోన్ చేశారట. గడచిన ఎన్నికల్లో పార్టీ వారికి ఇచ్చిన ప్రాధాన్యం, పార్టీ భవిష్యత్తును ప్రస్తావించిన జగన్, పార్టీ మారే యోచనను విరమించుకోవాలని సూటిగానే చెప్పినట్లు సమాచారం.
ఇక, తన నుంచి సహాయ సహకారాలు అందుకున్న ఎమ్మెల్యేలకు మాత్రం… ఓ విధమైన హెచ్చరికలు జారీ చేసినట్లుగా టాక్. గతంలో వ్యక్తిగతంగా తానూ చేసిన కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ… పార్టీ మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నేరుగా జగనే తమకు ఫోన్ చేయడంతో పార్టీ మారదామని భావించిన ఎమ్మెల్యేలు తమ వైఖరి మార్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ వర్గాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…