రామ్ చరణ్ ‘సర్జరీ’పై సంచలన ప్రకటన!

ప్రస్తుతం మెగా అభిమానుల చేత నీరాజనాలు పలికించుకుంటున్న రామ్ చరణ్ స్వరూపం ఒకప్పుడు మరోలా ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చెర్రీలో ఇంత మార్పుకు కారణం… ఆయనకు చేయించిన సర్జరీలేనని అధికారికంగానో, అనాధికారికంగానో సినేవర్గాల్లో హల్చల్ చేసిన సమాచారం. అయితే ఈ విషయాన్ని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ ధృవీకరించారు.

ఇంజినీరింగ్ విధ్యార్ధులకు క్లాసులు తీసుకున్న సమయంలో యండమూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిరంజీవి కొడుకుగా పుట్టిన రామ్ చరణ్ ను హీరో చేయాలనే భావన ఉన్న సురేఖ గారు, చెర్రీ గడ్డం దగ్గర సరిగా ఉండకపోవడంతో సర్జరీ చేయించారని అన్నారు. మరోవైపు మేము భాగస్వామ్యం అయిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమాకు తన స్నేహితుడు కొడుకు తానూ ముద్దుగా పిలుచుకునే ‘సరస్వతి ప్రసాద్’ వచ్చాడని, ఇళయరాజా గారు ‘అబ్బని తీయని దెబ్బ’ పాటకు చేస్తున్న సమయంలో, ఆ పిల్లవాడు టక్కున లేచి, ఇది శివరంజని రాగం కదా అని అడగడంతో… ఇళయరాజా గారు ఆ పిల్లవాడ్ని దగ్గరికి తీసుకుని, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశీర్వదించారని యండమూరి చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఆ ‘సరస్వతి ప్రసాద్’ పేరు మార్చుకుని ఇపుడు ‘దేవిశ్రీప్రసాద్’ అయ్యారని చెప్పగానే విద్యార్ధులంతా చప్పట్లతో మారుమ్రోగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యండమూరి, “ఇందాకడ రామ్ చరణ్ పేరు చెప్తే ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదని, కానీ ఇపుడు దేవిశ్రీప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు.., “మీ తండ్రి ఎవరూ అని కాదు, నువ్వు ఎవరు అని!” ఈ సందర్బంగా మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయంగా యండమూరి చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. యండమూరి వ్యాఖ్యలతో మెగా అభిమానులు మండిపడుతుండగా, విద్యార్ధుల మానసిక పరివర్తనలో భాగంగా యండమూరి చేసిన వ్యాఖ్యలివని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు.

Share
Published by

Recent Posts

PVR Onion Pakodi at Rs. 250: Is This Daylight Robbery?

PVR Cinemas has added a very familiar Indian snack to its food menu, but the…

5 minutes ago

Pawan Kalyan’s Heroine’s Unreal Downfall: No Comeback?

Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…

34 minutes ago