
ఇప్పటివరకూ… లాక్ డౌన్ తరువాత షూటింగ్ మొదలు పెట్టిన సినిమాలన్నీ వాటి షూటింగ్ దాదాపుగా లాక్ డౌన్ ముందే పూర్తి చేసుకున్నాయి. మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని అవసరమైతే ఓటీటీలలోనైనా విడుదల కావాలని ప్రణాళికతో షూటింగ్ మొదలుపెట్టినవే. అయితే #పీవీ3 విషయం మాత్రం అది కాదు.
#పీవీ3 40% షూటింగ్ లాక్ డౌన్ కు ముందు పూర్తి చేసుకుంది. సినిమా కథ, నటీనటుల విషయంలో గోప్యత పాటిస్తున్నారు. అయితే కథకు ప్రస్తుతం ఉన్న కరోనా సంకటస్థితికి ఏదో సంబంధం ఉండవచ్చు అన్నట్టు ఇప్పటిదాకా చేస్తున్న ప్రమోషన్స్ లో హింట్ ఇచ్చింది సినీ బృందం.
ప్రశాంత్ వర్మ అ! సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా పెద్దగా అలరించలేకపోయినా.. ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. దానితో ఈ యువ దర్శకుడు ఈ కొత్త సినిమా మీద భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపి, వైసీపీల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకవైపు కింజారపు అచ్చన్నాయుడు తదితరులు, మరోవైపు ధర్మాన…
Big films may bring bigger collections, but their ticket price hikes could make life harder…