
ఒక వైపు చిరంజీవి, మరో వైపు జూనియర్ ఎన్టీఆర్, ఇంకో వైపు పవన్ కళ్యాణ్, మరో దిక్కున చంద్రబాబు… ఇలా మూకుమ్మడిగా వైఎస్ పై దండెత్తుతూ ప్రచారం చేసిన సమయంలో కూడా ఏ ‘స్టార్’ హీరో ప్రచారం కూడా లేకుండా రెండవ సారి వైఎస్ ఎందుకు విజయం సాధించారంటే… దానికి సమాధానమే వైఎస్ ఆకర్షణీయమైన ప్రసంగం. ‘108 పేరు చెప్తూ కుయ్… కుయ్… కుయ్…’ అంటూ చేసిన ధ్వని ఇప్పటికీ ప్రజల చెవిలో వినపడుతూ ఉంటుందనడంలో సందేహం లేదు. అంతటి వైఎస్ ప్రసంగాలను తనయుడు జగన్ తన రాజకీయ ప్రచారానికి గానూ అనుకరించడం మొదలు పెట్టారు.
తొలినాళ్ళల్లో రాజకీయం కొత్త గనుక తండ్రిని అనుకరిస్తూ ప్రసంగాలు చేస్తున్నారన్న భావన ప్రజానీకంలో వ్యక్తమైంది. అయితే ఆ తొలినాళ్ళల్లో ప్రారంభమైన మాటలే ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. జగన్ ప్రసంగాలంటే… ఒకే తీరుగా… ఒకే మాటలు పదే పదే వినపడుతూ ఉంటాయి. అలాగే ‘వైఎస్ 108 కుయ్ కుయ్’ సౌండింగ్ మాదిరి ఏదొకటి ప్రయత్నిస్తూ ఉంటారు. అవి వ్యాఖ్యానించేటపుడు ప్రజల్లోకి నిజంగా వెళ్ళగలిగితే పర్వాలేదు… లేదంటే… సోషల్ మీడియాలో వేసే కౌంటర్లకు లెక్కేలేదు.
తాజాగా అనంతపురం జిల్లా పర్యటించిన జగన్… రైతులను ఉద్దేశిస్తూ ప్రసంగించిన సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అలాంటి అనుభూతినే కలిగిస్తుండడంతో నెటిజన్ల పాలిట ఆహారంలా మారింది. రొటీన్ గానే చంద్రబాబు సర్కార్ పై మండిపడుతూ తనకు మద్దతు పలకాలంటూ “రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఊపాలంటూ” జగన్ చేసిన వాక్చాతుర్యానికి నవ్వులు చిందడం విశేషం. మరి ‘అనుకరణ’లో ఉన్న ఇబ్బందులు ఇలాగే ఉంటాయి అంటున్నారు ‘నిపుణులు!’
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…