Politics

జగన్ గ్రాఫ్ తగ్గుతోంది… సాక్ష్యం ఇచ్చిన ‘గూగుల్’

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతోంది… ఇది గత రెండేళ్ళుగా టిడిపి నేతలు చెప్తున్న మాటలు. అయితే ఇవన్నీ రాజకీయంగా జగన్ ను తట్టుకోలేక తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయని వైసీపీ వర్గాలు జగన్ ను వెనుకేసుకొచ్చేవారు. అయితే ప్రజలలో జగన్ ఆదరణ తగ్గుతుందో లేదో తదుపరి ఎన్నికలు తెల్చేస్తాయి గానీ, ప్రస్తుతం మాత్రం జగన్ గ్రాఫ్ డౌన్ లోనే ఉందని ‘గూగుల్’ సంస్థ కూడా తేల్చేసింది.

2014 ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి నానాటికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరును వెబ్ ప్రపంచంలో వెతికే వారి సంఖ్య తగ్గిపోతోందని గణాంకాలు బయటపెట్టింది. ‘యువనేత’గా పేరుగాంచిన జగన్ పరిస్థితి ఇలా ఉంటే, మరో వైపు చంద్రబాబు నాయుడు మాత్రం తన పరిధిని పెంచుకుంటూ పోతున్నాడు. స్వల్ప వ్యవధిలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు గ్రాఫ్ పై స్థాయికి చూస్తోందని గణాంకాలు చెప్తున్నాయి.

ADVERTISEMENT

అలాగే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణా పరిస్థితిని గమనిస్తే… కేసీఆర్ ను మించిపోయే విధంగా కేటీఆర్ గ్రాఫ్ ఉండడం విశేషం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేటీఆర్ పేరును సెర్చ్ చేసే వారి సంఖ్యా గణనీయంగా ఉందని ‘గూగుల్’ లెక్కలు చెప్తున్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే… ముఖ్యమంత్రి కేసీఆర్ పేరునే వెనక్కి నెట్టేటంతగా! ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన నేతల వివరాలను ‘గూగుల్’ తన తాజా నివేదికలో వెల్లడించింది.

తెలంగాణలో ఇద్దరూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు మరియు తండ్రీకొడుకులే కావడంతో టాప్ 1 అండ్ 2 సమస్య తలెత్తదు. కానీ, ఏపీలో అలా కాదు. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించే జగన్ మోహన్ రెడ్డిని విస్మరించడమనే విషయం బహుశా పార్టీ వర్గాలు జీర్ణించుకోలేనిది. ఓ పక్కన ఇప్పటివరకు తన వెంట ఉన్న ఎమ్మెల్యేలు తనను విడిచి వెళుతుండడం మరో వైపు ‘గూగుల్’ వంటి నివేదికలు బయటకు రావడం జగన్ వర్గీయులను మానసికంగా కృంగదీస్తోంది… అలాగే జగన్ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

2 hours ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

2 hours ago