
‘కాల్ మనీ’ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘ చర్చ జరిగిన సమయంలో… నిందితులుగా ఆరోపిస్తున్న వారితో టిడిపి నాయకుల ఫోటోలను తీసుకువచ్చి జగన్ అభియోగాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అదే అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం నేతలు ఒక్కొక్కరుగా వివరణ ఇచ్చుకున్నారు. ఆ సమాధానాలతో జగన్ కూడా సంతృప్తి చెందడంతో మళ్ళీ తిరిగి ప్రశ్నలను సంధించలేదు. ఇదంతా ప్రజలు మీడియా ముఖంగా ప్రత్యక్షంగా వీక్షించినదే. అయితే మంగళవారం నాడు మధ్యాహ్న సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్, మళ్ళీ అవే ఫోటోలను తీసుకువచ్చి, అదే విధమైన ఆరోపణలు చేస్తూ ‘కధ’ మొదటికి తెచ్చారు.
ఈ ప్రెస్ మీట్ లో ‘కాల్ మనీ’ తర్వాత మరికాసేపు బాక్సైట్ త్రవ్వకాల గురించి ప్రస్తావిస్తూ… ఇటీవల విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఏ అంశాలనైతే ఉద్ఘాటించారో అవే వ్యాఖ్యలను కాస్త అటు ఇటు తిప్పి మాట్లాడి, మీడియా మిత్రుల సహనాన్ని పరీక్షించారు. అలాగే అసెంబ్లీ నుండి రోజా సస్పెండ్ అయిన తీరు కూడా! సరైన విషయం, అవగాహన, పరిజ్ఞానం లేకపోతే రాజకీయ ప్రసంగాలు ఇలాగే ఉంటాయని జగన్ చాటిచెప్తున్నారు. జగన్ చేస్తున్న ప్రసంగాలు బాల్యంలో చదువుకున్న ‘ఆవు’ పాఠ౦ మాదిరి తయారయ్యాయని, అంశం ఏదైనా చంద్రబాబు టార్గెట్ గా మాత్రమే వ్యాఖ్యలు చేస్తూ, తన అవగాహనాలేమిని బయట పెట్టుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
The glimpse of Gold Spot has arrived with a nostalgic flavour, offering a look into…
Andhra Pradesh politics has largely become a two-sided contest after the formation of the NDA…