Telugu

ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్!

తాజాగా ఈడీ జరిపిన జగన్ ఆస్తుల అటాచ్ మెంట్ తో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ నివాసం ఉంటున్న ఇంటిని, సాక్షి టవర్స్ ను జప్తు చేయనున్నామన్న ఈడీ ఉత్తర్వులే దీనికి కారణం. మరి దీని నుండి జగన్ బయటపడే అవకాశం ఉందా? ఈడీ ఇచ్చిన ఈ ప్రొవిజనల్ అటాచ్ మెంట్ నుండి తన నివాసాన్ని దక్కించుకునే సానుకూలత చట్టాలలో ఉందా? అన్న ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు కేవలం ప్రొవిజనల్ అటాచ్ మెంట్స్ మాత్రమేనని, దీనిని అడ్జ్యూడికేటింగ్ అధారిటీ ధృవీకరించాల్సి ఉంటుందని సమాచారం. ఒక్కసారి ఈ అధారిటీ ధృవీకరిస్తే ఇక జగన్ కు ఉన్న దారులన్నీ మూసుకుపోయినట్లేనని న్యాయనిపుణుల సమాచారం. అయితే ఈ అటాచ్ మెంట్ ను సవాల్ చేస్తే… అడ్జ్యూడికేటింగ్ అధారిటీ ముందు జగన్ తన వాదనను వినిపించుకోవచ్చని, అయినప్పటికీ ఈ ప్రక్రియ ముందుకెళితే హైకోర్టు, చివరగా… సుప్రీంకోర్టులను ఆశ్రయించవచ్చని సమాచారం.

ADVERTISEMENT

అయితే, అడ్జ్యూడికేటింగ్ అధారిటీ ఆస్తుల అటాచ్ మెంట్ ను గనుక ధృవీకరిస్తే… హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళినా పెద్దగా లాభం ఉండకపోవచ్చని, గతంలో జరిగిన కొన్ని ఉదంతాలను మీడియా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. నిజానికి గతంలో జగన్ ఆస్తులను అటాచ్ చేసిన సమయంలో హైకోర్టుకు వెళ్ళిన జగన్ కు చుక్కెదురైన సందర్భాన్ని వివరిస్తున్నారు. అంటే ప్రస్తుతం జగన్ భవిష్యత్తు ‘అడ్జ్యూడికేటింగ్ అధారిటీ’ చేతిలో ఉన్నట్లుగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

దీంతో పాటు జగన్ ఆస్తులు ప్రజలకు సంబంధించినవి అవి తిరిగి ప్రజలకు మాత్రమే చెందాలని ఒక కొత్త చట్టాన్ని ఏపీ సర్కార్ రూపొందించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేసిన ఈ చట్టం ద్వారా ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను తిరిగి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు ఎలా లభిస్తుందన్న దానిపై కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ‘సాక్షి’ పత్రికను, మీడియాను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందన్న సంకేతాలను గతంలో సిఎం వ్యక్తపరిచిన నేపధ్యంలో… మున్ముందు పరిణామాలు ఎలా జరగబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది.

‘క్రింద పడినా తనదే పై చేయి’ అన్నట్లుగా ఇప్పటివరకు తన మీడియా ‘సాక్షి’గా విరుచుకుపడ్డ జగన్ స్పందన కోసం సర్వత్రా వేచిచూస్తున్నారు. అయితే ఇపుడు ఆ ‘సాక్షి’ గొంతే మూగబోయే పరిస్థితులు ఏర్పడుతుండడంతో ఏ విధంగా తన స్వరాన్ని మార్చుకుంటారో చూడాలి. చూడబోతుంటే… “ముందుంది ముసళ్ళ పండగ” అన్న నానుడిగా జగన్ భవిష్యత్తు ఉండబోతుందన్న మాటలు పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

36 minutes ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

51 minutes ago