
ఇప్పటికి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిని ఇదే రకంగా బ్యాన్ చేసింది. జర్నలిస్టు మూర్తి జాయిన్ అయ్యాక టీవీ5 తమ పట్ల మరింత వ్యతిరేకంగా తయారయ్యిందని జగన్ భావిస్తున్నారు. దీనితో ఈ చర్యకు పూనుకున్నారు. ఈ నిర్ణయాన్ని బహిరంగ పత్రికా ప్రకటన లో చెప్పడం విశేషం. గతంలో టీడీపీ కూడా సాక్షిని తమ పార్టీ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధించింది. ఎప్పటి నుండో ఆ ఛానల్ చర్చా కార్యక్రమాలకు టీడీపీ ప్రతినిధులు హాజరు కారు.
మాములు రోజులలో వాక్ స్వతంత్రం గురించి లెక్చర్లు ఇచ్చే పార్టీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం విశేషం. రెండు నెలలలో ఎన్నికలు జరగనుండడంతో మీడియా పాత్ర చాలా కీలకం కాబోతుంది. మీడియా ప్రజలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే వచ్చిన బార్క్ టీఆర్ఫీ రేటింగ్లలో టివీ 5 మూడవ స్థానంలో ఉండడం విశేషం. టివీ5 కంటే ముందుగా టీవీ9, ఎన్టీవీ మాత్రమే ఉన్నాయి. ప్రజాదరణ ఉన్న టీవీ ఛానల్ ను ఎన్నికల ముంగిట బ్యాన్ చెయ్యడం అనేది ఒక రకంగా సాహసమనే చెప్పుకోవాలి.
The general trend is that the urban population are generally slow and low when it…
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…