Telugu

వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులుకు ట్రీట్ ఇస్తున్న టీడీపీ, మెగా ఫ్యాన్స్

మెగా అభిమానులు, టీడీపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్ జరుగుతుంది. జనసేనకు ఈ ఎన్నికలలో ఘోరపరాజయం ఎదురయ్యింది. ఎన్నికలలో జనసేన కేవలం ఒక్కే ఒక్క సీటు తన ఖాతాను తెరిచింది. తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. 137 సీట్లలో పోటీ చేస్తే 120 చోట్ల ధరావత్తు కోల్పోయారు ఆ పార్టీ అభ్యర్థులు.

అయితే మెగా అభిమానులలో ఆ బాధ ఏమాత్రం లేదు. పైగా టీడీపీ ఓటమిని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది టీడీపీని ఓడించడానికి తాము వైఎస్సార్ కాంగ్రెస్ కు ఓటు వేశామని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రజారాజ్యం పార్టీ జెండా పీకేద్దామా అంటూ ఈనాడులో అప్పట్లో వచ్చిన ఒక ఆర్టికల్ ను చూపించి చంద్రబాబు అలా చేయించాడు అని అదే టైటిల్ తో టీడీపీ బీజేపీలో విలీనం అవుతుంది అంటూ జనసేన శతాగ్ని టీం పోస్టర్లు విడుదల చేస్తుంది.

ADVERTISEMENT

అయితే తమ ఓటమి సంగతి చూసుకోకుండా ఈ గోల ఏంటని పార్టీ కోసం పని చేసిన వారు తలపట్టుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు ప్రజారాజ్యం పార్టీ జెండా పీకేద్దామా అంటూ ఈనాడులో అప్పట్లో వచ్చిన ఒక ఆర్టికల్ ను ఆ తరువాత నిజం చేశాడు ఇంక దేనికి మీ ఏడుపు అంటూ వారికి కౌంటర్లు ఇస్తున్నారు. జెండా పీకేయ్యడానికి టీడీపీ ఏమైనా ప్రజారాజ్యం పార్టీనా అంటూ వారిని ఎద్దేవా చేస్తున్నారు. ఇరుపక్షాల వారు కొట్టుకుంటుంటే వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Paradise OTT Backlash: Mahesh Babu’s Son Adds More Fuel

Nani’s The Paradise is facing another round of backlash after its Netflix premiere. The film…

23 minutes ago

Ramayana US Advance Sales: Yash Getting Brutally Trolled?

Namit Malhotra’s Ramayana has crossed $517K in US premiere advance sales, but the numbers reveal…

53 minutes ago