
ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి తన ఎన్నికల ఖర్చుల స్టేట్మెంట్ ను సమర్పించింది. దాని ప్రకారం ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన ఐ-ప్యాక్ కు 37 కోట్ల 57 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. ఇది కేవలం మర్చి నుండి ఏప్రిల్ వరకు చేసిన పెమెంట్స్. అంటే ఎన్నికలకు కొంచెం ముందు.
మొత్తంగా ఐ-ప్యాక్ కు పాదయాత్ర నాటి నుండి కనీసం 250 కోట్లు ఇచ్చి ఉండవచ్చని అంచనా. అలాగే ఏప్రిల్ లో చేసిన ఎన్నికల సర్వే కు 59 లక్షలు ఖర్చు చేసినట్టు చెప్పారు. అయితే ఇదంతా వైట్ లో ఇచ్చిన అమౌంట్, అనధికారంగా ఇంకా ఎన్నో రేట్లు ఖర్చుపెడతారని సహజంగా అందరూ అనుకునేదే.
2019 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ లో 151 సీట్లు సాధించి సెన్సషనల్ గెలుపుని సాధించింది. జగన్ పార్టీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ టీం పాత్ర చాలా కీలకంగా ఉందని అంతా ఒప్పుకుంటారు. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన ఒక అతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషల్ మీడియా డైరెక్టర్ గా ప్రభుత్వంలోకి కూడా తీసుకున్నారు సీఎం జగన్.
ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిషోర్ టీం వైఎస్సార్ కాంగ్రెస్ కు పని చెయ్యడం ఆపేసింది. అప్పటి నుండి ఆ పార్టీ సోషల్ మీడియాలో వీక్ అయ్యి, టీడీపీ బలపడటం మొదలు పెట్టింది. దీనితో అప్పుడు ఏపీ క్యాంపైన్ కు పని చేసిన బ్రహ్మానంద పాత్రని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోకి తీసుకునివచ్చారు.
YS Jagan Mohan Reddy seems to have found his biggest election issue even before the…
అవును. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మాట చెప్పారు. నేడు తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో మాట్లాడుతూ,…