
సరే చంద్రబాబు హయాంలో అలానే జరిగింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏం జరుగుతున్నట్టు? కులాల వారీగా మతాల వారీగా కూడా ప్రకటిస్తున్న తాయిలలకు నిధులు ఎక్కడ నుండి వస్తున్నాయి? ఆదాయం పెరిగే చర్యలు ఏమన్నా తీసుకున్నారా అంటే ఈ ఆరు నెలలు ఆ దాఖలాలు అయితే లేవు. వస్తున్న ఆదాయం అంతా జీతాలు, పెన్షన్ల కు కూడా సరిపోని పరిస్థితి.
మరి అప్పులు చేయకుండానే కొత్త పథకాలకు, పాత కట్టడాలకు కొత్త రంగులు వెయ్యడానికి డబ్బులు వస్తున్నాయా? ఇక పసుపు కుంకుమ విషయానికి వస్తే… పసుపు కుంకుమ డబ్బులు ప్రజాలకేగా వెళ్లాయి. పోనీ అది తప్పు అయితే ఆ మొత్తం లబ్దిదారుల నుండి వసూలు చెయ్యండి. అప్పులు చెయ్యడం లో ఎవరూ ఎవరికీ తీసిపోని పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంది.
సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చి సంపద సృష్టించబడుతుంది అనే నమ్మకం అయితే ఎవరిలోను లేదు. ఈ ఆరు నెలల పాలనలో జగన్ అటువంటి నమ్మకం అయితే ఎవరిలోను కలిగించలేదు. ఇక ముందు కూడా అదే కొనసాగితే అప్పులు పుట్టే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. మంత్రులు ఇటువంటి రొటీన్ విమర్శలు పక్కన పెట్టి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెడితే వారికే మంచిది.
Kajal Aggarwal had earlier said that she was playing a small role in Ramayana, but…
A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…