
బొబ్బిలి (సుజయకృష్ణ రంగారావు), సాలూరు (రాజన్నదొర), కురుపాం (పుష్ప శ్రీవాణి) నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే ఇప్పటికే బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన సోదరుడు బేబి నాయన కూడా టీడీపీలో చేరనున్నారు. అలాగే, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కూడా పార్టీ మారే అవకాశాలున్నాయన్న పిడుగు లాంటి వార్తతో బొబ్బిలి కోటకు వెళ్లిన విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి తదితరులకు కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమని రాజన్నదొర ముఖం మీదే చెప్పేసారన్న సమాచారంతో వైసీపీ వర్గాలు నిరాశగానే వెనుతిరిగాక తప్పని పరిస్థితి.
ఇక అసెంబ్లీ లోపల, బయట జరుగుతున్న పార్టీ ఆందోళనల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నంటి ఉంటున్న కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కూడా టీడీపీలో చేరుతున్నట్లు మీడియా వర్గాల వేదికగా వార్తలు జోరందుకున్నాయి. పుష్ప శ్రీవాణి టీడీపీలో చేరిపోతే… ఉత్తరాంధ్రలో కీలక జిల్లా అయిన విజయనగరం మొత్తం టిడిపి వశం అవుతుండగా, వైసీపీకి అసలు ప్రాతినిధ్యం గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…