రోహిత్ ఆత్మహత్యకు – చంద్రబాబుకు సంబంధమేంటి?

వినడానికి వింతగా ఉన్న ఈ ప్రశ్నకు తెరలేపింది ఎవరో తెలిస్తే… ప్రత్యేకంగా ఎవరూ ఆశ్చర్యపడరు. ఎందుకంటే… ఆ పార్టీ అధినేత అనుసరించే రాజకీయాలు ఆ స్థాయిలోనే ఉంటాయని రాజకీయ వర్గాలు ప్రత్యేకంగా చెప్పుకుంటాయి మరి! సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ప్రచారంలో భాగంగా రోహిత్ ఆత్మహత్యను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలకు దిగింది.

“సెంట్రల్ యూనివర్సిటీలో పాలకుల పాపం… విద్యార్ధుల్ని దేశద్రోహులుగా చిత్రిస్తారా… దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా చంద్రబాబుకి పట్టదా… కుల వివక్షను పెంచిపోషిస్తున్నారా…” అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసుకుని వైసీపీ ప్రచారం చేస్తోంది. అసలు జగన్ పార్టీ తెరలేపిన ఈ ప్రచారానికి ఒక అర్ధముందా? అంటూ సోషల్ మీడియా వేదికగా జగన్ పార్టీ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ADVERTISEMENT

జరిగింది చంద్రబాబు పాలిస్తున్న రాష్ట్రంలో కాదు, ఒకవేళ తెలుగువాడిగా చంద్రబాబు స్పందించాలని భావించినా, గత రెండు రోజులుగా చంద్రబాబు స్విస్ పర్యటనలో భాగంగా ఏపీలో పెట్టుబడులు గురించి విస్తృత చర్చలు జరుపుతున్నారు. అయినా చంద్రబాబుపై జగన్ పార్టీ ఎందుకు విమర్శలు చేస్తోంది? అదే జగన్ పార్టీ స్పెషాలిటీ అంటున్నారు రాజకీయ వర్గీయులు.

‘ఆవు’ పాఠం మాదిరి… రెండు తెలుగు రాష్ట్రాలలో ఏం జరిగినా జగన్ పార్టీ వర్గీయులు చంద్రబాబు వద్దకే వచ్చి ఆగుతున్నట్లుంది. దేశంలో ఏం జరిగినా చంద్రబాబే బాధ్యత వహించాలనే విధంగా వైసీపీ పోకడలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం వాపోతున్నారు. అర్థవంతమైన విమర్శకు ఎప్పుడూ విలువుంటుంది… ఇలాంటి అసత్య వ్యాఖ్యలకు విషపూరితమే తమ అభిమతం అని అర్ధం చేసుకోవాలా?

Share
Published by

Recent Posts

Pawan Kalyan’s Heroine’s Unreal Downfall: No Comeback?

Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…

28 minutes ago

Mahendragiri Varahi Is Today’s Cinema and a Hit – Akhil

Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…

51 minutes ago